ETV Bharat / state

మార్కెట్లో వ్యాపారులు.. రోడ్డుపై రైతులు..

జగిత్యాల జిల్లా కేంద్రంగా మారిన మౌలిక వసతులు పెరగడం లేదు. జిల్లా కేంద్రం మొత్తం ఒకటే కూరగాయల మార్కెట్. రద్దీకి తగ్గట్టుగా మార్కెట్ లేకపోవడంతో.. రైతులు రోడ్డుపక్కనే విక్రయాలు చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి.

market-problems-in-jagityal
రోడ్డుపై రైతులు.. మార్కెట్​ కష్టాలు
author img

By

Published : Dec 18, 2019, 7:24 AM IST

జగిత్యాల పట్టణంలో వలస వచ్చిన వాళ్లతో పాటు... పట్టణంలో జీవించే ప్రజలు లక్షా యాభై వేల వరకు ఉన్నారు. ఇంత పెద్ద పట్టణానికి ఒకే కూరగాయల మార్కెట్‌ ఉండటం.. సమస్యగా మారింది. టవర్‌ సర్కిల్‌ ప్రాంతంలో ఉన్న 50ఏళ్లనాటి మార్కెట్‌ అభివృద్ధికి నోచుకోకపోవటం వల్ల కూరగాయలు కొనేందుకు వస్తోన్న ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారిపైనే కూరగాయలు అమ్ముతుండటంతో నిత్యం ట్రాఫిక్‌ సమ్యసలు తప్పడం లేదు

రోడ్డుపై రైతులు.. మార్కెట్​ కష్టాలు

మార్కెట్​లో 40 లక్షలతో ఒక షెడ్‌ నిర్మించినా.. ఉపయోగం లేకుండా పోయింది. షెడ్‌ లోపల వ్యాపారులు ఉంటుండగా... రైతులు రోడ్లపైనే అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించవలసిన పాలక వర్గం.. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది.

జగిత్యాలలో రైతు బజారు ఉన్నా సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారింది. పాత బస్టాండ్‌లో ఉన్న చిన్న కూరగాయల ఎటూ సరిపోవటం లేదు. పట్టణంలో చిన్న చిన్న మార్కెట్లు నిర్మిస్తే ఎంతో మేలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అధికారులు తమ విజ్ఞప్తిపై దృష్టి సారించాలని జగిత్యాల వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:'రైతులకు ఖచ్చితమైన ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి'

Intro:from
G.Gangadhar
jagityala
.

note. స్క్రిప్ట్ f t p లో పంపాను...

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.