తెలంగాణ సర్కారు గ్రామాల రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో మహిళలకు ముగ్గుల పోటీలు.. విద్యార్థులకు వ్యాస రచన పోటీలు జరిగాయి.
ఉత్తమంగా ప్రతిభ కనపరిచిన వారికి మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు. జగిత్యాల మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అందమైన ముగ్గులు వేశారు. విద్యార్థులకు పల్లె ప్రగతిపై వ్యాసరచన పోటీలు జరిగాయి. ఉత్తమంగా నిలిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్పై నేడు 'సుప్రీం' విచారణ