జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గుర్రాల అనిల్ అనే వ్యక్తికి ఇటీవల కుమారుడు పుట్టాడు. అయితే కొడుకు పుట్టిన సంతోషం, ముద్దుముచ్చట తీరకముందే బాలుడి తండ్రి అనిల్, తల్లి వనితలకు కరోనా సోకింది. కరోనా మహమ్మారి నుంచి బాలుడి తల్లి బయటపడగా.. తండ్రి అనిల్ మాత్రం కరోనాతో పోరాడుతూ... కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రెండురోజుల్లో డిశ్చార్జ్ అయి.. వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ కూడా చేశాడు. బంధుగణం సమక్షంలో నామకరణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే అనిల్ మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇదీ చదవండి: పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి