జగిత్యాల గాంధీనగర్‌లో దుబ్బ ప్రశాంత్ అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేసే ప్రశాంత్ రాత్రి జగిత్యాలకు వచ్చాడు. అంతలోనే ఆత్మహత్య చేసుకోవటం కుటుంబసభ్యులను కలిచి వేసింది. స్నేహితుల దినోత్సవం రోజు చనిపోవటం వల్ల జగిత్యాల ఆస్పత్రి వద్దకు అతని మిత్రులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ ఘటనపై జగిత్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 6 నెలలుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నానని లేఖ రాసి ఉంది. ప్రేమ విఫలం కావటంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
ఇవీచూడండి: హయత్‌నగర్ కిడ్నాపర్‌కు 18 ఏళ్ల నేర చరిత్ర