జగిత్యాల జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలవుతుంది. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను నిలువరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, ఆర్డీవో మాధురి, జిల్లా ఎస్పీ సింధూశర్మ లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు