కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జగిత్యాల జిల్లాలో లాక్‌డౌన్ పగడ్బందీగా కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కూరగాయలు, నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. జగిత్యాల టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న మార్కెట్ ఇరుకుగా ఉండటం వల్ల అదనపు మార్కెట్లను ఏర్పాటు చేశారు.
అదనపు కలెక్టర్ బి రాజేశం, మున్సిపల్ ఛైర్ పర్సన్ బి. శ్రావణి పరిశీలించారు. సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలని సూచించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో అదనపు కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇదీ చూడండి: నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ