జగిత్యాల జిల్లా పొలాస గ్రామ మహిళలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మహిళా సంఘ సభ్యులను గ్రామ సీఏలు మోసం చేస్తున్నారని.. వారిని తొలగించాలని ఆందోళనకు దిగారు. బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు ఒక్కొక్కరి వద్ద రూ. రెండు వేలు తీసుకుని పొదుపు ఖాతా లెక్కలు సరిగా చూపట్లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసకోవాలని కోరారు. జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని శాంతింపజేయడం వల్ల మహిళలు ఆందోళనను విరమించారు.
ఇదీ చదవండిః 'మనకున్న ఒకే ఒక్కదారి... మొక్కల్ని పెంచడం'