ETV Bharat / state

కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్​ప్లాన్​

author img

By

Published : Feb 25, 2023, 8:12 AM IST

Kondagattu Anjanna Temple masterplan : కొండగట్టు ఆలయ అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేక మాస్టర్​ప్లాన్​ను సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. యాదాద్రి, వేములవాడ తరహాలో ఇక్కడా కూడా ప్రత్యే అథారిటీని ఏర్పాటు చేయాలని సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ మాస్టర్​ ప్లాన్​ రూపకల్పనను 75రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

kondagattu anjanna
కొండగట్టు అంజన్న

Kondagattu Anjanna Temple masterplan: ప్రసిద్ది చెందిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్​ ప్లాన్​ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మాస్టర్​ ప్లాన్​ను 75రోజుల్లో సిద్ధం చేయాలని సంకల్పించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ దేవాలయానికి చాలా మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అందుకు సరిపడా వసతులు.. సౌకర్యాలు లేవు. రహదారి మార్గాలు కూడా సరిగ్గా లేవు. ఈ దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం కేసీఆర్​ ఇక్కడ పర్యటిస్తూ.. ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా రూ.500 నుంచి రూ.600కోట్లు అయినా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.

Kondagattu Anjanna Temple development masterplan : ప్రభుత్వ ఉత్తర్వులతో గుట్ట అభివృద్ధికి పూర్తిస్థాయి మాస్టర్​ప్లాన్​ రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ కసరత్తు కొలిక్కి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి అధికారులు నిర్ణయించనున్నారు. ఆలయం చుట్టూ ఉన్న అటవీ ప్రాంతానికి నష్టం కలగకుండా ప్రధాన ఆలయ విస్తరణ, కల్యాణ మండపం, వివిధ ఆలయాల నిర్మాణాలకు ప్రణాళికలు రచించనున్నారు.

ఎస్సారెస్పీ నుంచి నీటి మళ్లింపు: భవిష్యత్తులో కొండగట్టుకు నీటి ఎద్దడి రాకుండా ఎస్సారెస్పీ కాల్వ నుంచి పైపులైన్​ ద్వారా నీటిని తరలించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించారు. ఆలయ విస్తరణ తర్వాత పెరిగే భక్తులను దృష్టిలో ఉంచుకొని.. లిఫ్టు ద్వారా నీటిని గుట్టపైకి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ లైన్​కు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

రహదారుల నిర్మాణానికి ఏర్పాట్లు: ఆలయం పైకి రహదారులు వెళ్లేలా ఆర్​ అండ్​ బీ అధికారులు రహదారుల నిర్మాణానికి పరిశీలిస్తున్నారు. గుట్ట ప్రాంతం అంతా సర్వే చేపట్టనున్నారు. అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేశారు. వచ్చే నెల లోగా సర్వేను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కొండగట్టు అంజన్న ఆలయానికి కూడా ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ, వేములవాడ ఆలయ అభివృద్ధి సంస్థల లాగా ఈ దేవాలయానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆలయ అభివృద్ధి విషయంలో అన్ని శాఖల మధ్య సమన్వయం ఉంటుందని మంత్రి అన్నారు. అందుకు సర్వే పూర్తైన తర్వాత ఈ తంతు పూర్తి చేయాలని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.