రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెరాస పార్టీ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, పురపాలక కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులుగా కలిసి కేక్‌ను కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ అన్నారు. నిరంతరం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని దేవున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం