Organic Farming Jagtial : వ్యవసాయంలో వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నాడు ఓ రైతు. సమీకృత వ్యవసాయానికి శ్రీకారం చుట్టి.. లాభాలు ఆర్జిస్తున్నాడు. సొంతంగా సేంద్రియ ఎరువులు తయారు చేసుకొని.. వివిధ రకాల పంటలు పండిస్తూ రైతులందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
విభిన్న ఆలోచనలతో..
![Organic Farming Jagtial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-11-22-aadrsha-annadhaath-pkg-ts10037_22122021134017_2212f_1640160617_557.jpg)
Organic Cultivation : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌కు చెందిన భూమేశ్వర్....వ్యవసాయంలో విభిన్న ఆలోచనలతో మందుకు సాగుతున్నారు. 7 ఎకరాల భూమిలో సేంద్రియ ఎరువు ద్వారా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. నీటి కుంటలు ఏర్పాటు చేసుకొని.. వ్యవసాయానికి వినియోగించడంతో పాటు చేపలు పెంచుతున్నారు. అర ఎకరం చేపల పెంపకానికి కేటాయించుకున్నారు. మరో అర ఎకరంలో దేశీయ కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకొని పెంచుతున్నారు . ఇంకో ఎకరా భూమిలో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఆకుకూరలు, టమాటా, మిర్చి, సొర , బీర, చిక్కుడు వంటివి సాగు చేస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నారు.
జీవామృతంతో సేద్యం..
![Organic Farming Jagtial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-11-22-aadrsha-annadhaath-pkg-ts10037_22122021134017_2212f_1640160617_978.jpg)
Organic Farming Telangana : సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువుతో పంటలు పండిస్తూ దిగుబడులు పొందుతున్నారు. గో మూత్రం ద్వారా జీవామృతాన్ని తయారు చేసి పంటలపై పిచికారి చేసి తెగుళ్లు రాకుండా కాపాడుతున్నారు. భూసారం పెరిగేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా విభిన్న రీతిలో పంటలు పండిస్తూ.. సాగు రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. సమీకృత వ్యవసాయం ద్వారా ఆదాయం గడిస్తూ.. ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఉత్తమరైతుగా అవార్డు అందుకున్నారు.
సాగులో నూతన ఒరవడి..
![Organic Farming Jagtial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-11-22-aadrsha-annadhaath-pkg-ts10037_22122021134017_2212f_1640160617_479.jpg)
Profits With Organic Farming : సాగులో నూతన ఒరవడి సృష్టిస్తున్న భూమేశ్వర్‌ను వ్యవసాయ అధికారులు అభినందిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి అన్నదాతలను తీసుకువచ్చి భూమేశ్వర్ వ్యవసాయ క్షేత్రాన్ని చూపిస్తున్నారు. సమీకృత వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. సమీకృత వ్యవసాయం ద్వారా సంవత్సరానికి సుమారు 5 లక్షల ఆదాయం పొందవచ్చని భూమేశ్వర్ తెలిపారు.