జగిత్యాల జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తితో భయానికి గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. జనం బయటకు రాకపోవడం వల్ల ఆర్టీసీలో ప్రయాణించే వారు కరవయ్యారు. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన రెండు ఆర్టీసీ బస్సులు గంటన్నరకు పైగా ప్లాట్‌ఫారమ్ పై ఎదురుచూసినా.. జనం ఎక్కకపోవడం వల్ల డిపోకే తిరిగి వెళ్లిపోయాయి.
మిగతా బస్సుల్లోనూ అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణించడం లేదు. ఫలితంగా ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది.