ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూరగాయల మార్కెట్ ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ రవి.. అధికారులను ఆదేశించారు. మెట్పల్లి పురపాలక సంఘంలో ఏర్పాటు చేయనున్న మార్కెట్ స్థలాన్ని ఆయన పరిశీలించారు.
మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 8 నెలలు గడుస్తున్నా.. పనులు పూర్తి కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు కలెక్టర్. కూరగాయల మార్కెట్‌తో పాటు మాంసం మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకోసం త్వరలోనే స్థలాన్ని కేటాయిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆ ఊరంతా జాతీయ స్థాయి ఆటగాళ్లే!