ETV Bharat / state

ఉద్రిక్తత: జగిత్యాల కలెక్టరేట్​ వద్ద రైతుల ధర్నా.. అడ్డుకున్న పోలీసులు - జగిత్యాలలో రైతుల ధర్నా

మొక్కజొన్న రైతులు ఆందోళనను ఉద్ధృతం చేస్తున్నారు. మహాధర్నాకు పిలుపునిచ్చిన అన్నదాతలు.. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జగిత్యాల పట్టణం, రూరల్​ ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్​ను​ విధించారు. ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా.. వారినుంచి తప్పించుకుని వచ్చి రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గళమెత్తారు.

ఉద్రిక్తత: జగిత్యాల కలెక్టరేట్​ వద్ద రైతుల ధర్నా.. అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Oct 23, 2020, 12:35 PM IST

జగిత్యాలలో మొక్కజొన్న రైతులు ఆందోళనను ఉద్ధృతం చేస్తున్నారు. మహాధర్నాకు పిలుపునిచ్చిన అన్నదాతలు.. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. మొక్కజొన్నలకు మద్దతు ధర కల్పించాలని నినదించారు. వరి ధాన్యం సన్నరకాలు రూ. 2,500కు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

మహాధర్నా పిలుపుతో ముందు జాగ్రత్తగా జగిత్యాల పట్టణం, రూరల్ ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదన్నారు. పోలీసు వలయం నుంచి తప్పించుకుని వచ్చిన అన్నదాతలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వాళ్లను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు నినాదాలు చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గళమెత్తారు.

ఇదీ చదవండి: మొక్కజొన్న పంటకు మద్దతు ధర కోసం కామారెడ్డిలో రైతుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.