జగిత్యాల జిల్లాలోని సంగపల్లి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం నిర్వాహకుల మోసాన్ని రైతులు గుర్తించారు. బాట్లు, రాళ్లతో వేసిన తూకంలో ఎక్కువ ధాన్యం పోతున్నట్లు గమనించిన రైతులు... అవే బస్తాలను మళ్లీ ఎలక్ట్రిక్ కాంటాపై తూకం వేశారు. దాదాపు ఒక్కో బస్తాకు 3 నుంచి 6 కిలోలు అదనంగా వేసినట్లు గుర్తించారు.
అంటే క్వింటాలుకు 10 నుంచి 12 కిలోలు అదనంగా తూకం వేశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనేటప్పుడు రైతులను మోసం చేయడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ