ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్ల ఇబ్బందులపై కలెక్టర్​ సమీక్ష - జగిత్యాల జిల్లా తాజా వార్తలు

జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న సమస్యలపై కలెక్టర్​ రవి సమీక్షించారు. మిల్లర్లు రైతులను మోసం చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం వస్తే టార్ఫలిన్లు, రవాణా సమస్యలు రాకుండా కాల్​సెంటర్​ ఏర్పాటు చేయాలని సూచించారు.

ధాన్యం కొనుగోళ్ల ఇబ్బందులపై కలెక్టర్​ సమీక్ష

author img

By

Published : Apr 25, 2020, 8:21 PM IST

జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఉపందుకున్నాయి. జిల్లాలో 389 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ప్రతిపాదనలు తయారు చేయగా.. ఇప్పటికే 300కిపైగా కేంద్రాలు ప్రారంభించి.. యంత్రాంగం కొనుగోళ్లు సాగిస్తుంది. అయితే క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు తలెత్తుతున్నందున జగిత్యాల జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి అధికారులతో సమావేశమయ్యారు.

జిల్లాలో కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలని.. మిల్లర్లు రైతులను మోసం చేయకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ రవి ఆదేశాలు జారీ చేశారు. వర్షం వస్తే టార్ఫలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు రవాణా సమస్య రాకుండా చూడాలని.. ఎదైనా సమస్య ఉంటే కాల్‌ సెంటర్‌కు సమాచారం ఇచ్చేలా ప్రతి కేంద్రంలో కాల్‌ సెంటర్‌ నంబరు ఏర్పాటు చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు.

ఇదీ చదవండి: కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.