జగిత్యాల జిల్లా మెట్పల్లి డిపో వద్ద ఆర్టీసీ మహిళా ఉద్యోగులు దీక్ష చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ సమస్యను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చూడండి : "డెంగీని నివారించండి... లేకపోతే మృతులకు రూ.50 లక్షలు ఇవ్వండి"