జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీరామ్ సేన యువకులు ప్రతిష్టించిన మట్టి వినాయకుని నిమజ్జనోత్సవం నిరాడంబరంగా ముగిసింది. ఆలయంలోనే నిర్వహించిన ఈ నిమజ్జన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.
పర్యావరణ హితం మట్టి వినాయకుడిని ప్రతిష్టించి.. తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు, అభిషేకాలు చేశారు. రాత్రి పూట భజన కార్యక్రమాలు, సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా వినాయకుని ప్రతిష్టించిన స్వయంభు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారుల వేద మంత్రాల మధ్య పంచామృతాలతో గణనాథుని అభిషేకిస్తూ.. చక్ర స్నానం చేయిస్తూ స్వామి వారికి వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసిన ఈ నిమజ్జనం ఆసాంతం ఆకట్టుకుంది.
ఇదీచూడండి.. లక్ష్యం చేరని పుస్తకం... డిజిటల్ తరగతులు ఎలా?