జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. 20 రోజులకు గాను రూ.47 లక్షల 10 వేలు, 35 గ్రాముల బంగారం వచ్చినట్లు వెల్లడించారు.
1,650 గ్రాముల వెండి, 8 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఈవో చెప్పారు. భారీ భద్రత మధ్య హుండీ లెక్కింపు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చిన సొమ్మును బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: నేటి అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర