Viral Fevers in Jagtial Telangana : జగిత్యాల జిల్లాలో జ్వర పీడితులతో(Viral Fevers) ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో మంచాలు నిండిపోతుండటంతో వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు అన్నీ రోగులతో నిండిపోయాయి.
జగిత్యాల జిల్లాలో గత కొద్ది రోజులుగా జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. మునుపెన్నడూ లేనంతగా డెంగీ(Dengue), మలేరియా(Malaria) వంటి వైరల్ జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో జ్వర పీడితులే వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో మంచాలు నిండిపోవడంతో.. కొత్తగా వచ్చే రోగులను చేర్చుకోవటం ఇబ్బందిగా మారిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో.. ఆస్పత్రులు జ్వర పీడితులతోనే దర్శనమిస్తున్నాయి.
"ఈ ఏడాది చాలా మంది జ్వరాల బారినపడి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో పడకలు లేక బయట కూడా రోగులు ఉంటున్నారు. ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. తలనొప్పి, నడుం నొప్పి బాగా ఉంది. బ్లడ్ టెస్ట్ చేశారు. అప్పుడప్పుడూ జ్వరం వస్తుంది." - రోగి
Dengue Cases Increase in Jagtial District : వర్షాకాలం కావడంతో ప్రజలు జ్వరాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని, వారి ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇంటి పరిసరాల్లో దోమలు, ఈగలు లేకుండా చూసుకోవాలని, పరిశుభ్రమైన నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరాల బారిన పడిన వారు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Viral Fevers in Gadwal District : విజృంభిస్తున్న విషజ్వరాలు.. ఆ ఊళ్లో సగానికి పైగా బాధితులే
"ప్రస్తుతం ఈ సీజనల్ జ్వరాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్ ఓపీ వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ జ్వరాలు, డెంగీ జ్వరాలతో రోగులు వస్తున్నారు. చాలా మందికి ఓపీలోనే మందులు ఇస్తున్నాం. చాలా మందిని ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నాం. ఇంటి పరిసరాల్లో దోమలు, ఈగలు చేరకుండా ఉంచుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు చేరకుండా చూసుకోవాలి. జ్వరాలు వచ్చిన వాళ్లు భయపడకుండా ఇంట్లోనే ఉంటూ చికిత్స చేసుకోవాలి." - డా.వాసాల శ్రీధర్, జగిత్యాల ప్రభుత్వాసుపత్రి ఆర్‌ఎంవో
Jagital Peoples Faces Viral Fevers : అధికారులు పారిశుద్ధ్య నిర్వాహణ పనులు చేపట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డ్రైనేజీ సమస్యలు, చెత్తాచెదారం ఎక్కడా వేయకుండా, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.