జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ప్రాథమిక వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించటంలేదని.. వారి తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. సరైన సమయానికి వైద్యులు, వైద్యసిబ్బంది విధులకు రావటం లేదని వాపోయారు. తమపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సందర్శించినా... వారి తీరుమారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వచ్చినా... ఆ వైద్యుల తీరు మారలేదు
ఆ ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సింది 15మంది. కానీ ఉన్నది మాత్రం నలుగురు. డాక్టర్ రావల్సిన సమయం తొమ్మిది. కానీ పది దాటినా వారి జాడ ఎక్కడా కనిపించదంటూ స్థానికులు వాపోయారు.