కరోనా నియంత్రణలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఏఎన్ఎం ఆశావర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు, దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణిలను గుర్తించడం వైద్య ఆరోగ్య శాఖ సర్వే చేపట్టింది. దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి లక్షణాలు ఉన్నప్పటికీ చాలా మంది వైద్యులను సంప్రదించడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాధి లక్షణాలున్న వారి గుర్తింపునకు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
వైద్యులను సంప్రదించాక వారి సలహాల మేరకే మందులు వాడాలని, దుకాణాలకు వెళ్లి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. పట్టణంలోని ప్రజలు ఏ రోగాలతో బాధ పడుతున్నారు, వాడుతున్న మందులు, కరోనా లక్షణాలున్న వారి వివరాలు తెలుసుకోడానికి ఈ సర్వే చేపట్టామనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నరేందర్ తెలిపారు.