ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన హరితహారం సమష్టి కృషితో ముందుకు తీసుకెళ్లాలని మెట్‌పల్లి పురపాలక ఛైర్‌పర్సన్ సుజాత తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలక పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హరితహారంలో భాగంగా పలు రకాల మొక్కలను నాటారు.
నాటిన ప్రతి మొక్క సంరక్షణ, పెరుగుదలకు అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఛైర్‌పర్సన్ సుజాత కోరారు. కళాశాలలో ఇప్పటికే ఉన్న పలు రకాల చెట్లు చూసి అధ్యాపక బృందాన్ని అభినందించారు.
ఇవీ చూడండి: కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..