అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మకళాకారుడు గుర్రం దయాకర్ ప్రత్యేకత చాటుకున్నారు. నృత్యకారులను ప్రొత్సహించేలా నువ్వు గింజ పరిమాణంలో బంగారు విగ్రహాన్ని తయారు చేశారు. సుమారు 20 గంటలపాటు శ్రమించి 0.17 మిల్లీ గ్రాముల బరువున్న నృత్యకారిణి విగ్రహాన్ని బంగారంతో తీర్చిదిద్దారు. అంతర్జాతీయంగా భారతీయ నృత్య ప్రదర్శనలను ప్రోత్సహించేందుకే విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు దయాకర్ తెలిపారు.
ఇవీచూడండి: మయూర విహారం.. ప్రకృతితో మమేకం