లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ నిత్యవసర సరుకులను అందజేశారు. 7వ వార్డులోని నిరుపేద కూలీలు 65 మందికి సరుకులను పంపిణీ చేశారు.
వారి బాగోగులు ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.. మరికొన్ని రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని.. పేదల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వారికి భరోసా కల్పించారు. ఎమ్మెల్యేతోపాటు జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి, కౌన్సిలర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మే ఆఖరుకు 4 కోట్ల మంది చేతిలో మొబైళ్లుండవ్!