జగిత్యాల జిల్లా కేంద్రంలో భీష్మ సినిమాని గంగపుత్రులు అడ్డుకున్నారు. తమ జాతి పితామహుడు బీష్మను అసభ్యకరంగా చూపిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. హిందువుల ఆరాధ్య గ్రంథం మహా భారతంలోనే కీలక వ్యక్తి భీష్మ అని అన్నారు. సినిమాలో అవమానకర సన్నివేశాలు ఉన్నాయంటూ నటరాజ్ టాకీస్ ముందు బైఠాయించారు. వెంటనే అసభ్య సన్నివేశాలు, సినిమా టైటిల్ను తొలగించాలని గంగపుత్రులు డిమాండ్ చేశారు. చిత్ర దర్శకుడిపై చట్ట రీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆందోళన కారులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
ఇవీ చూడండి : సమాజం మార్పునకు తయారు చేసిన ఆయుధమే 'కమ్యూనిస్ట్ మానిఫెస్టో'