జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో గంగామాత ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుంచి గంగామాతకు విశేష అభిషేకాలు నిర్వహించి... వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.
అనంతరం రాత్రివేళ గ్రామంలోని గంగామాత చెరువులో అర్చకుల వేద మంత్రాల మధ్య గంగామాతకి తెప్పోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇవీచూడండి: ఆర్టీసీ సమ్మెపై ఎటూ తేల్చని ప్రభుత్వం