ETV Bharat / state

అమెరికాలో మృతి.. ఆన్​లైన్​లో అంత్యక్రియలు

అమెరికాలో భర్త వద్దకు వెళ్లిన ఆ మహిళను విధి చిన్నచూపు చూసింది. ఊహించని రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని చిదిమేసింది. కుటుంబ సభ్యుల కడసారి చూపు కోసం మృతదేహాన్ని భారత్​కు తీసుకురావాలని అనుకున్నారు. కానీ పాస్​పోర్ట్​ ఎక్కడో పడిపోవడంతో.. అంత్యక్రియలు అక్కడే నిర్వహించారు. ఆ తల్లి కడసారి చూపు దక్కక వారి పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.

Take a look online
కడసారి చూపు ఆన్​లైన్​లోనే
author img

By

Published : Mar 13, 2022, 10:48 PM IST

జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన కందుకూరి విజయ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త వద్దకు ఈ మధ్యనే వెళ్లిన ఆమె రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఆమె పాస్​పోర్ట్​ ఎక్కడో పడిపోవటంతో మృతదేహాన్ని భారత్​కు తీసుకురాలేకపోయారు. దీంతో అంత్యక్రియలు అక్కడే నిర్వహించారు. మల్యాలలో ఉన్న ఆమె ఇద్దరు కుమారులు, బంధువులు చివరి చూపును ఫోన్‌లో చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చదవండి: భర్త జ్ఞాపకాలే ఊపిరిగా... సమాధి వద్దే పెళ్లిరోజు వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.