మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అంత్యక్రియలు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో గోదావరి తీరాన అధికార లాంఛనాలతో జరిగాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రత్నాకర్ రావు భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అంత్యక్రియల్లో మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జానారెడ్డి పాల్గొన్నారు. కడసారి తమ నేతను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి నివాళులు అర్పించారు. పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.