జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు భక్త జన సంద్రంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంత భక్తులు ఆలయానికి తరలి రావటం వల్ల ఆలయం కిటకిటలాడుతోంది. మేడారం జాతరకు ముందు కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారు చాలా మంది భక్తులు.
ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి రావటం వల్ల క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతోంది. జనసందోహం పెరగటం వల్ల ఆలయం బయట ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇవీ చూడండి: జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!