ETV Bharat / state

అర్చకులపై కొవిడ్ పంజా.. వారం వ్యవధిలో అయిదుగురు మృతి... - జగిత్యాల కొవిడ్​ వార్తలు

భగవంతునికి భక్తులకు మధ్య వారధిగా ఉండే అర్చకులపై కొవిడ్​ మహమ్మారి ప్రభావం చూపుతోంది. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో వారం రోజుల్లో అయిదుగురు పూజారులు కొవిడ్​ మహమ్మారికి బలవ్వడం తీవ్ర విషాదం నింపింది.

Five priests were killed with covid
Five priests were killed with covid
author img

By

Published : May 11, 2021, 1:52 PM IST

జగిత్యాల జిల్లాలో కొవిడ్​ మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు వందల సంఖ్యల్లో పాజిటివ్​ కేసులు వస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. పలు ప్రాంతాల్లో అర్చకులు కొవిడ్​తో మృత్యువాత పడుతున్నారు. వారం వ్యవధిలోనే ఐదుగురు పూజారులు బలయ్యారు.

బీర్‌పూర్‌ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పని చేసే పూజారి రామయ్య పంతులు ఈనెల 4న కొవిడ్​తో మృతి చెందారు. ఆయన కుమారుడు లక్ష్మణాచార్యులు కొవిడ్​తోనే ఊపిరి వదిలారు. ఒకే కుటుంబంలో తండ్రి, కుమారుల మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మనిగిపోయింది. రాయికల్‌ మండల కేంద్రంలోని హనుమాన్‌ ఆలయంలో పనిచేస్తున్న శ్రీనివాసశర్మ ఈనెల 4న మరణించగా... ఆయన సోదరుడు హనుమాన్​ శర్మ ఇవాళ తుదిశ్వాస విడిచారు. హనుమాన్ శర్మ సోదరుని కుమారుడు శరత్‌ శర్మ కూడా ఈ వారంలోనే మృతి చెందాడు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరగడం వల్ల అర్చకులు భయటకు రావడానికి జంకుతున్నారు. వివాహాది శుభకార్యాలు జరిపించేందుకు వెనకడుగు వేస్తున్నారు.

ఇదీ చూడండి: అంబులెన్సులు నిలిపివేయడం మానవత్వమేనా?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.