జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన పవిత్రోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆలయంలోని ప్రాకార మండపంలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు.
ఉత్సవాల్లో భాగంగా నేడు అగ్ని ప్రతిష్ట, హోమం నిర్వహించారు. దోష నివారణ కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
