జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల క్రాస్ రోడ్డుపై వరి ధాన్యానికి నిప్పు పెట్టి రైతులు నిరసన తెలిపారు. గత 45 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన చెందారు. తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి తూకం కోసం ఎదురు చూస్తున్నామని మండిపడ్డారు.
పొలాస వరి వంగడం 24423 ధాన్యం పండించామని అధికారులను సంప్రదించినా… ఫలితం లేకపోయిందని అన్నారు. వర్షాలు పడే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రంలో ఆరు బయట ధాన్యాన్ని నిలువ చేస్తే తడిసి మరింత నష్ట పోతామని వాపోయారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: corona: ప్రతి 10మందిలో నలుగురికి పరీక్షలు చేస్తున్నాం: డీహెచ్