4 వేల ఎకారాల్లో సాగు
మినుము పంటకు ప్రభుత్వం క్వింటాకు రూ.5,600 మద్దతు ధరను చెల్లిస్తుండడం వల్ల రైతులు మినప సాగుపై ఆసక్తి చూపారు. మెట్పల్లి డివిజన్లోని కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మేడిపల్లి మండలాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో సాగు చేశారు. పంట చేతికొచ్చి 40 రోజులు గడుస్తున్నా సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. దీనిపై కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిల్వ చేయడమే ప్రధాన సమస్య
రైతులకు మినుము పంటను నిల్వ చేయడం ప్రధాన సమస్యగా మారింది. కొందరు ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో నిల్వ చేయగా.. మరికొందరు ఎండకు కుప్పలుగా పోసి ఆరబెడుతూ పడరాని పాట్లు పడుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మినుము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి :ఆదాయం ఘనం.... అభివృద్ధి శూన్యం..