ETV Bharat / state

నిరుపేద మహిళకు చేయూతనిచ్చిన ఫేస్​బుక్​ మిత్రులు - vijayawada women news

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ సామాజిక సేవకుడు ఫేస్​బుక్​లో పెట్టిన పోస్టు... ఓ నిరుపేద మహిళకు చేయూతనిచ్చింది. తల్లిదండ్రులు, భర్త లేని ఆ మహిళకు తామున్నామంటూ ఫేస్​బుక్​ మిత్రులు అండగా నిలిచారు. తన దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స కోసం తలా కొంచెం సాయం చేశారు.

face book friends helped to a vijayawada women

author img

By

Published : Aug 1, 2020, 8:42 PM IST

విజయవాడలోని వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ నిరుపేద మహిళ కుటుంబానికి ఫేస్​బుక్ మిత్రులు చేయూతనందించారు. రుడావతి మహేశ్వరికి తల్లిదండ్రులతో పాటు భర్త కొన్నేళ్ల క్రితం మరణించించాడు. దీనికి తోడు మహేశ్వరి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది.

అత్యంత దీనస్థితిలో తన చెల్లిలితో కలసి నివాసముంటున్న మహేశ్వరి పరిస్థితిని పలువురు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్​ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన రమేశ్​... మహేశ్వరి పరిస్థితిని వివరిస్తూ ఫేస్​బుక్​లో పోస్ట్ పెట్టాడు. బాధితురాలి దీనస్థితిని చూసి చలించిన ఫేస్​బుక్ మిత్రులు... చికిత్స కోసం ఆమె ఖాతాలో రూ.1.29 లక్షలు జమ చేశారు.

ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.