కారులో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న ముఠాను జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి లక్షకు పైగా విలువ చేసే సెల్‌పోన్లు, ఏపీ 05 డీసీ 0211 నెంబరు గల కారు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రపదేశ్ తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ప్రాంతానికి చెందిన కొప్పిశెట్టి శ్రీనివాస్, ముప్పిడి వెంకట్రావ్, ముయ్య సూర్యనారాయణ, తోట దుర్గాప్రసాద్ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠా నాయకుడు వెంకటరమణ... ముందుగా చోరీ చేయాల్సిన ప్రదేశాలు గుర్తించి సభ్యులను పంపిస్తాడు. కారు అద్దెకు తీసుకొని రద్దీ ప్రదేశాల్లో సెల్ఫోన్లు, పర్సులు చోరీ చేస్తారు. పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ముఠా గుట్టు రట్టు చేశారు. వెంకటరమణ కోసం గాలిస్తున్నారు.
ఇవీ చూడండి: నల్లగొండలో చివరిరోజు జోరుగా నామినేషన్ల పర్వం