పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు.. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణానికి చెందిన ధమ్ మారో ధమ్ యువజన సంఘం సభ్యులు. ఏడు సంవత్సరాలుగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నారు. మట్టితో చేసిన భారీ మట్టి గణనాథుడి విగ్రహాన్ని నెలకొల్పి ఆదర్శంగా నిలుస్తున్నారు.
అవగాహన..
ధమ్ మారో ధమ్ యువజన సంఘానికి చెందిన 40 మంది సభ్యులు ఏటా సుమారు రూ.20 నుంచి రూ. 40 వేల వరకు ఖర్చు చేస్తూ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. పట్టణంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే ముప్పును గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి మట్టి విగ్రహాలపై అవగాహన కలిగిస్తున్నారు.
అభినందనలు..
ధమ్ మారో ధమ్ యువజన సంఘం సభ్యులు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. ప్రతి యువజన సంఘం పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను నెలకొల్పే విధంగా అవగాహన కలిగించాల్సిన అవసరముందని తెలిపారు.
ఇదీ చూడండి :మట్టి గణపతి - మహా గణపతి