జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా.. క్యూలైన్లు నిండి వెలుపల వరకు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి గంట సమయం పడుతోంది.
వసంత పంచమి కావటంతో వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంజన్న దర్శనం చేసుకుంటున్నారు. భక్తులతో నిండిపోయిన ఆలయం రామనామ జపంతో మారుమోగుతోంది.
- ఇదీ చూడండి: బాసరలో వసంత పంచమి వేడుకలు