ETV Bharat / state

జగిత్యాల జిల్లాలోని మూడు పట్టణాల్లో తగ్గిన మొక్కల శాతం

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం పట్టణాల్లో అర్ధభాగమే విజయవంతమవుతోంది. మొక్కలు నాటడంలో చూపిన శ్రద్ధ వాటిని కాపాడటంతో చూపకపోవడం వల్ల లక్ష్యం నెరవేరడం లేదు. జగిత్యాల జిల్లాలో ఏటేటా నాటుతున్న మొక్కల సంఖ్య పెరుగుతున్నా బతుకుతున్న మొక్కల శాతం తగ్గుతోంది. ఈ సారైనా ప్రజాభాగస్వామ్యం, సమష్టికృషి తోడైతే పట్టణాలు హరితశోభితమయ్యే అవకాశం ఉంది.

decreased-percentage-of-plants-in-the-three-towns-of-the-jagietal-district

author img

By

Published : Jul 2, 2020, 1:03 PM IST

ప్రభుత్వం ఆరో విడత హరితహారానికి శ్రీకారం చుట్టింది. ఏటా జూన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా, పల్లె, పట్నం తేడా లేకుండా పచ్చదనం విస్తరింపజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. గత ఐదేళ్లలో జగిత్యాల జిల్లాలో హరితహారానికి ప్రభుత్వం నిధులు వెచ్చించి భారీగా మొక్కలు నాటింది. కానీ పాలకుల నిర్లిప్తత, ప్రజల సంపూర్ణ భాగస్వామ్యలోపంతో చాలా మొక్కలు ఎండిపోయాయి. మొక్కలు నాటడంలో అన్ని పురపాలికలు లక్ష్యానికి చేరువైనా వాటిని సంరక్షించుకోవడంలో మూడు పట్టణాలు విఫలమయ్యాయి. ఫలితంగా నాటిన మొక్కల్లో సగభాగం కూడా దక్కకుండా పోయాయి. జగిత్యాల జిల్లాలోని కొత్త పురపాలికలైన రాయికల్‌, ధర్మపురిలను మినహాయిస్తే జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో గత ఐదేళ్లలో అధికశాతం మొక్కలు సంరక్షణ లేక పచ్చదనానికి దూరమయ్యాయి.

కోరుకున్న మొక్క పెంచాలి ఎంచక్కా..

ఈసారి ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన మొక్కలే అధికంగా పంపిణీ చేసి వందశాతం మొక్కలు బతికేలా ప్రణాళిక రచించింది. మూడు పట్టణాల్లో ప్రజలకు ఆమోదయోగ్యమైన మొక్కలనే నర్సరీల్లో పెంచారు. వీటినే వారికి ఇవ్వనున్నారు. ఇందుకోసం గత ఏడాది జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యంలో ఓ సర్వే నిర్వహించారు. ఇందులో గృహ యజమానులు తమకు నచ్చిన పండ్ల, పూల మొక్కలు కావాలని కోరారు. జగిత్యాల, మెట్‌పల్లి పురపాలికలో సమాఖ్యల ఆధ్వర్యంలో నర్సరీలను పెంచారు. కోరుట్లలో పురపాలక సంఘమే నర్సరీని అభివృద్ధి పరిచింది. దాదాపుగా వీటినే ప్రజలకు అందించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

ఇవీ చూడండి: ఖైరతాబాద్​ ఆర్టీఏ కార్యాలయంలో మొక్కలు నాటిన పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.