ఇదీ చూడండి:రేప్ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్మెంట్ థియరీ'
దండారి వేడుకల్లో ఆదివాసీ మహిళల సందడి - జగిత్యాల జిల్లా మంగెళ
దీపావళి పండుగకు ముందు ఆదివాసీలు జరుపుకునే దండారి వేడుకలు జగిత్యాల జిల్లా మంగెళలోని గోండు గూడెంలో ఘనంగా నిర్వహించారు. ఆదివాసి మహిళలు దండారి నృత్యాలతో సంబరాల్లో మునిగితేలారు.
దండారి వేడుకల్లో ఆదివాసీ మహిళల సందడి
దీపావళి వేడుకల సందర్భంగా ఆదివాసీలు నిర్వహించే దండారి వేడుకలు జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం మంగెళ గొండు గూడెంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు దీపావళి వరకు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. తొలి రోజు నిర్వహించిన ఈ వేడుకల్లో ఆదివాసి మహిళలు దండారి నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. సమీప గూడేల నుంచి తరలి వచ్చిన గిరిజన వనితలతో గోండు గూడెం సందడిగా మారింది.
ఇదీ చూడండి:రేప్ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్మెంట్ థియరీ'
sample description