జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. లాక్డౌన్ తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు రావటం ఇదే తొలిసారని ఆలయ అర్చకులు తెలిపారు.
గత కొద్ది రోజులుగా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం పడుతోంది. భక్తుల రాకతో ఆలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: 'అయోధ్య గుడి నిర్మాణాన్ని కళ్లారా చూడొచ్చు!'