ETV Bharat / state

కరోనా మహమ్మారిపై చిత్రం.. ప్రజల్లో అవగాహన

జగిత్యాలలో ఓ కళాకారుడు వేసిన కరోనా మహమ్మారి బొమ్మ స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించే విధంగా వేసిన ఈ చిత్రాన్ని డ్రోన్​ కెమెరా ద్వారా బంధించారు.

corona-awareness-to-people-by-the-art-in-jagityala
కరోనా మహమ్మారిపై చిత్రం.. ప్రజల్లో అవగాహన
author img

By

Published : Apr 16, 2020, 11:20 AM IST

కరోనా మహమ్మారిని తరమికొట్టేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు జగిత్యాల కొత్త బస్టాండ్‌ కూడలి వద్ద చెన్న నాగరాజు అనే చిత్రకారుడు వేసిన బొమ్మ పలువురిని ఆకట్టుకుంటోంది. అతని మిత్రులు సలీం, మంజు, బాబా, రమేశ్‌తో కలిపి తమ సొంత ఖర్చులతో ఈ కరోనా మహమ్మారి బొమ్మను వేసినట్లు వారు చెప్తున్నారు.

ఇంట్లోనే ఉందాం.. పోలీసులకు సహకరిద్దాం.. కరోనాను తరిమి కొడుదాం అనే నినాదంతో వేసిన ఈ బొమ్మను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనపరుస్తున్నారు. జగిత్యాల బస్​స్టాండ్​ కూడలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ బొమ్మ దృశ్యాన్ని డ్రోన్‌ కెమెరాలో బంధించారు. చిత్రం ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తున్న చిత్రకారుల కృషిని జగిత్యాల డీఎస్సీ వెంకటరమణ అభినందించారు.

కరోనా మహమ్మారిపై చిత్రం.. ప్రజల్లో అవగాహన

ఇవీచూడండి: కంటైన్మెంట్​ జోన్​ ప్రజలకు అండగా ఉంటాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.