జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని బోలి చెరువు కింద ఉన్న ఐదు వేల ఎకరాల ఆయకట్టు నీళ్లు అందక పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోతోందని... డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అప్పు చేసి రైతులు పంటకు పెట్టుబడి పెట్టారని... అది ఎండిపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామయ్యపల్లె వద్ద జాతీయ రహదారిపై రైతులు ఆందోళన నిర్వహించారు.
ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్... అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ధర్నా కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపచేశారు.
ఇదీ చదవండి: నా ఆటో ఇవ్వకపోతే..ఫ్లైఓవర్ నుంచి దూకేస్తా..