45 రోజుల లాక్‌డౌన్‌లో రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా లేవని... మద్యం అమ్మకాల తర్వాత పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరగడానికి సీఎం కేసీఆర్ స్వార్థమే కారణమని విమర్శించారు. దేశంలోనే అతితక్కువ పరీక్షలు తెలంగాణలోనే చేస్తున్నారని పేర్కొన్నారు.
పాజిటివ్ వచ్చినవాళ్లను కూడా 14 రోజుల తర్వాత టెస్టులు చేయకుండానే డిశ్చార్జ్ చేస్తున్నారని అన్నారు. జగిత్యాల ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో రత్నాకర్‌రావు కుటుంబసభ్యులను పరామర్శించిన రేవంత్... కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. రైతుబంధు విషయంలో కొత్త మెలికలు పెట్టి.. రైతులకు డబ్బులు ఇవ్వకుండా చేయడమే ప్రభుత్వం ఉద్దేశ్యంలా కనిపిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమావేశం