జగిత్యాల జిల్లాలో జరిగిన 30 రోజుల ప్రణాళికపై జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టిన పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మొక్కలు ఎండిపోకుండా నీరు పోయాలని తెలిపారు. పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని, రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
ఇదీ చూడండి : "రేపటి ఆర్టీసీ బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి"