ETV Bharat / state

25 ఏళ్ల తర్వాత .. నేడు కొండగట్టుకు సీఎం కేసీఆర్ - సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన కొత్త షెడ్యూల్

CM KCR Kondagattu Tour today : కొండగట్టు అంజన్న ఆలయం దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పనుల్లో నేడు కీలక అడుగు పడనుంది. గుడి పునర్నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమవుతుండగా.. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండగట్టుకు వెళ్లనున్నారు. తొలి విడతలో రూ.100 కోట్ల నిధులు కేటాయించడమే కాకుండా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన స్థపతి ఆనంద్ సాయి ఆధ్వర్యంలో ప్రాథమిక అధ్యయనం జరిగింది.

CM KCR Kondagattu Tour
CM KCR Kondagattu Tour
author img

By

Published : Feb 15, 2023, 6:47 AM IST

CM KCR Kondagattu Tour: దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్‌ రానున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించక ముందు 1998లో ఆలయానికి వచ్చిన కేసీఆర్‌.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్నారు. ఆలయాన్ని దివ్యక్షేత్రంగా రూపుదిద్దే క్రతువులో భాగంగా ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు ప్రకటించారు. ఇందులో భాగంగా చేపట్టాల్సిన పనులపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

సుమారు రెండు గంటల పాటు కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్న సీఎం.. ఆలయ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. స్వామివారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆర్కిటెక్ట్‌ ఆనంద్ సాయితో కలిసి ఆలయాభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

కొండగట్టులో సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా పరిశీలించారు. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ రానున్న దృష్ట్యా (మంగళవారం) నిన్న రాత్రి 8 గంటల నుంచి ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు.

భక్తుల హర్షం..: ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రాక పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరైన సదుపాయాలు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నామని, నిధుల కేటాయింపుతోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టులో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. ఘాట్ రోడ్ల అభివృద్ధి, ఆలయ ఆవరణలో గ్రీనరీ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, నూతన కాటేజీల నిర్మాణం.. నడకదారి అభివృద్ధి లాంటి పనులు చేయాలన్న డిమాండ్ ఉంది. తాగు నీటితో పాటు కోనేరులో నీటి కోసం ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. కొత్తగా క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు మహిళలు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి..

ఆగమశాస్త్రం ప్రకారం కొండగట్టు అభివృద్ధి: ఆనంద్​ సాయి

నీటి కోసం 74 ఏళ్ల వృద్ధుడి భగీరథ ప్రయత్నం.. మూడు బావులను తవ్విన 'వెల్​మ్యాన్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.