ETV Bharat / state

ఉత్తమ డ్రైవర్లకు​ ఘన సన్మానం - ఉత్తమ డ్రైవర్లు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ రీజనల్ మేనేజర్.. ఉత్తమ డ్రైవర్లను ఘనంగా సత్కరించారు. ప్రతీ ఉద్యోగి సమష్టిగా కృషి చేయాలని కోరారు.

closing ceremony of the National Road Safety was held at Metpalli in Jagittala
ఉత్తమ డ్రైవర్లకు​ ఘన సన్మానం
author img

By

Published : Feb 16, 2021, 12:47 PM IST

ఇంధనం ఆదా చేస్తూ బస్సులు నడిపితే.. ఆర్టీసీ లాభాల బాట పడుతుందని కరీంనగర్ రీజనల్ మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ డిపోలో నిర్వహించిన 32వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఇంధన పొదుపుతో పాటు, ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు పాల్పడని ఉత్తమ డ్రైవర్లను శ్రీధర్​ ఘనంగా సత్కరించారు. ప్రత్యేక బహుమతులతో పాటు నగదు పురస్కారాన్ని అందించారు. ఆర్టీసీని నమ్ముకుని వచ్చిన ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాలని సూచించారు.

ఇదీ చదవండి: సెల్లు మీదే కళ్లు: మనసు మల్లుతోంది... యమపురి పిలుస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.