జగిత్యాలలో ఓ కంపనీ పేరుతో ముందుగా 500 రూపాయలతో సభ్యత్వం తీసుకుని ఆ తర్వాత వస్తువులు, గిప్టులు వస్తాయని 42 మంది వద్ద 11 వేల 750 రూపాయలు కట్టించుకున్నారు. నెలలు గడిచినా ఎలాంటి గిప్టులు, వస్తువులు రాకపోవటంతో మోసపోయామని బాధితులకు అర్థమైంది. నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు నిర్వాహకులు జగిత్యాలకు వచ్చారని సమాచారం తెలుసుకున్న బాధితులు వారిని పట్టుకొని ఓ ఇంట్లో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సదరు కంపెనీపై విచారణ జరుపుతున్నారు. జిల్లాలో ఇంకా చాలా మందే బాధితులున్నట్లు తెలుస్తోంది.
బహుమతుల పేరుతో ఘరానా మోసం - GOLUSU KATTU MOSAM
భారీగా ఆదాయంతోపాటు గిప్టులు, వస్తువులు వస్తాయని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న గొలుసుకట్టు వ్యాపారం జగిత్యాలలో వెలుగు చూసింది.