ఆదాయం 14; వ్యయం 14 .
రాజపూజ్యం 3; అవమానం 1.
మకరరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అదృష్టవంతులు అవుతారు. ఆర్థికంగా కలిసివస్తుంది. అద్భుతమైన వాక్శుద్ధి ఉంటుంది. చేసే పనుల్లో విజయం త్వరగా సిద్ధిస్తుంది. బంగారు భవిష్యత్తు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక లాభాలు కనబడుతున్నాయి. ఇంటా బయటా కలిసివస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి.
విద్యార్థులకు శుభయోగం ఉంది. సుస్థిరమైన ఫలితాలనే సాధిస్తారు. గతంకన్నా యోగ్యమైన కాలం నడుస్తోంది. విశేష ధన లాభాలున్నాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. దానివల్ల పేరు వస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. కుటుంబసభ్యుల వల్ల కలిసి వస్తుంది. అపరిచితులను నమ్మవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఏ సమస్యారాదు. శని, రాహు శ్లోకాలు చదువుకోవాలి. విఘ్నాలు తొలగుతాయి.
ఇదీ చూడండి: వృషభ రాశి వారికి ప్లవ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది?