జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వినాయక నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా సాగింది. పట్టణ శివారులోని వట్టి వాగు వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పురపాలక అధికారులు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు. కరోనా ప్రభావం ఉండటం వల్ల పోలీసులు అధికారులు మండపాల నిర్వాహకులకు ఎలాంటి ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో వినాయక మండపం నిర్వాహకులు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహించిన వినాయక ప్రతిమలను కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై ఊరేగింపుగా తీసుకు వచ్చి వట్టి వాగులో నిమజ్జనం చేశారు.
వాగులోకి ఎవరూ వెళ్లకుండా రక్షణగా కర్రలను ఏర్పాటుచేసి పురపాలక సిబ్బంది ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: గణేశుడి నిమజ్జనం.. భాగ్యనగరంలో భారీ బందోబస్తు