జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బంగారు పెద్దమ్మతల్లికి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు ఉండి అమ్మవారికి నైవేద్యంతో సమర్పించి.. డప్పుచప్పుళ్లతో బోనాలను నెత్తిన ఎత్తుకుని వీధుల గుండా ఊరేగించారు. అనంతరం బోనాలను సమర్పించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: అధికారులను బాధ్యులను చేయడం శోచనీయం